Friday, 31 July 2026 11:23:31 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మంథనిలో అలరించిన త్యాగరాజ ఆరాధనోత్సవం

శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర ఆలయంలో 129 వ సంగీత విభావరి...! కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ తిరుపతయ్య బృందం

Date : 04 January 2026 06:42 PM Views : 319

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తిరుపతయ్య, ఇతర సంగీత గురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కీర్తనలు భక్తులను మంత్రముగ్గులను చేసింది. మంథనిలోని ఈ ఆలయంలో నిర్వహించిన 129వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంథని సంగీత కళాశాలలో మృదంగం విధ్వాన్సులుగా విధులు నిర్వహిస్తున్న భీమా శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కనకమాలక్ష్మి మాట్లాడుతూ మంథని భక్తికి, ఆరాధనకు నిలయమని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతినిత్యం సప్తహాలు, ఆలయాల్లో ఎక్కాహం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస భక్తి కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించే కార్తీక మాసం భక్తి కార్యక్రమాలు, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాంత భక్తి ప్రవృత్తులకు నిదర్శనమన్నారు. వరంగల్లోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ప్రొఫెసర్ వెంకటరమణ సంగీత ల ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు లోకే శరత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, లోకే శరత్ లను వారు సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ గాయకుల బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ సంగీత విద్వాంసకులు వి లక్ష్మణాచారి, ఎం సృజన్, షణ్ముఖ ప్రియా, మధులిక, సంతోష్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం, శ్రీరంభట్ల నరహరి, అవధానుల శ్రీనివాస్, రామడుగు శారద, రామడుగు శ్రీనివాస్, గట్టు మాధవి, మారుపాక నిఖిలతో పాటు అవదానుల మధు, రావి కంటి మనోహర్, కాచే జగన్, మహావాది సతీష్ కుమార్, జంబోజి రాజేశం, కొల్లారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :