ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ షాక్ కారణంగా రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయా డిస్కంలను ఆదేశించింది. ఘటన జరిగిన 2 నెలల్లోపే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని చెప్పింది. రాష్ట్రంలో 20 లక్షల సన్న, చిన్నకారు, కౌలు రైతుల కుటుంబాలు, 29లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
Admin
E Nivas News