ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముఖి టాలెంట్ పోటీలలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి చెకుముఖి టాలెంట్ పరీక్షకు ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. టెన్త్ విద్యార్థి ఎం. సాయి, 9వ తరగతి విద్యార్థి ఎం. చరణ్, 8వ తరగతి జీ. అభిరామ్ లు ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మన పాఠశాలను ఉన్నత స్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News