ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సంక్షేమంలో ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యం కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, రైస్ మిల్లుల నిర్వహకులు సి.ఎం.ఆర్. లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ఎస్ ఆర్ ఎం రైస్ మిల్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తో, గాయత్రి రైస్ మిల్ ను మండల తహసిల్దార్ పుష్పలత తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని తెలిపారు. రైస్ మిల్లుల కేటాయించిన ధాన్యం సి ఎం ఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని శ్రీరామ రైస్ మిల్ ను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం దండేపల్లి మండలంలోని జై యోగేశ్వర రైస్ మిల్, దండేపల్లి, కొర్విచెల్మ లలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను మండల తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని తెలిపారు. ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశిత సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News