ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ పై అక్రమంగా నాలుగు కిలోల గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఉట్నూరు సిఐ.ఎం. ప్రసాద్ తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు మార్కగూడ గ్రామపంచాయతీ నవగూడకు చెందిన కొడప రమేష్ అలియాస్ కొడప గంగు, కుంర గంగారం మరియు మార్కాపూర్ కొలంగూడకు చెందిన కుముర కృష్ణ ముగ్గురు కలిసి నవగూడ నుండి ఒక మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు సిఐ. ఎం. ప్రసాద్ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ. సాయన్న, పోలీసులు ఇంద్రవెల్లి స్మశానవాటిక వద్ద వారి కోసం వేచి ఉండగా మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో వారు అక్కడికి చేరుకున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి దాదాపు నాలుగు కిలోల గంజాయి, ఒక మోటార్ సైకిల్ మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. అనంతరం నిందితులను మరియు స్వాధీనం చేసిన ప్రాపర్టీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి పై కేసు నమోదు చేసి ఉట్నూర్ కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News