ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చెన్నూర్ అసెంబ్లీ పరిధిలోని ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో శుభ్రత, పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతూ చెన్నూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రివర్యులు మరియు చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో శుభ్రత, చెత్త తొలగింపు, పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యం మరియు అవసరమైన ఇతర సదుపాయాలు కల్పించాలని మహమ్మద్ ఇలియాజుద్దీన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేస్తూ చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో అవసరమైన శుభ్రత మరియు పారిశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచించినట్లు తెలిపారు.ఇలా చేయడం వల్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెన్నూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ఇలియాజుద్దీన్ తెలిపారు.
Admin
E Nivas News