Wednesday, 17 June 2026 01:33:15 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి..

Date : 07 April 2026 01:28 AM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బోత్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించినగ్రామసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి బోథ్ నియోజవర్గాన్ని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బోథ్ నియోజకవర్గానికి ₹200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పిప్రి, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు సమస్యలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బోథ్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు దగ్గర చేయాలనిబుగ్గారం, సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు 22 కొత్త చెరువుల నిర్మాణం, 18 చెరువులకు మరమ్మతులతో పాటు 23 చెక్ డ్యాం ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, మరియు దహేగాం ప్రాజెక్ట్ నిర్వాసితులైన 200 కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.బోథ్ సెంట్రల్ లైటింగ్,రింగ్ రోడ్డు కోసం 43 కోట్లు కేటాయించాలని,ఇచ్చోడ – సిరికొండ డబుల్ రోడ్డు, సిరిచేల్మ - పులగం పండ్రి,భరంపూర్, మోర్కండి, జందాపూర్ - కరంజి రోడ్డునిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేసి కొత్త రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు. నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, తలమడుగు, సోనాల, భీంపూర్, సిరికొండ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు నిర్మించాలని కోరారు. బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.బోథ్ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ రంగానికి సంబంధించితలమడుగు మండలంలోని సుంకిడి లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని, దీంతో తలమడుగు, తాంసి, బీంపూర్ మండలాల రైతులకు ప్రయోజనం జరుగుతుందని కోరారు.వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు ₹10,000 వెంటనే ఇవ్వాలని కోరారు. జొన్న, మొక్కజొన్న పంటలను పరిమితులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చోడ పీహెచ్సీను 30 పడకల సిహెచ్సిగా అప్‌గ్రేడ్ చేయాలనినియోజక వర్గానికి అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.గిరివికాసం పథకంలో నిధులు పెంచాలని కోరారు.గ్రామాల అభివృద్ధి కోసం 20కోట్లు, రైతుల పొలాల కోసం వెళ్ళే రోడ్ల నిర్మాణానికి ₹20 కోట్లు మొత్తం 40 కోట్లు SDF నిధులు మంజూరు చేయాలని కోరారు.కుంటాల, గాయత్రి, పొచ్చెర, కనకాయి జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.సిరిచెల్మ మల్లికార్జున స్వామి దేవాలయం, భరంపూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.ఇచ్చోడలో షాదిఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోయిన రోడ్లకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరారు.మధుర ఎస్టి (లబానా/బంజారా) వర్గాన్ని జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే కోరారు.ఈ అన్ని అంశాలను ముఖ్యమంత్రి కి వినతిపత్రంలో సమర్పించినట్లు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: