Friday, 31 July 2026 06:16:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమలు

సిపి అంబర్ కిషోర్ ఝా..

Date : 03 April 2026 11:07 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ లో శనివారం ఉదయం 06:00 గంటల నుండి చైర్‌పర్సన్,వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారంతెలిపారు. ఈ ఆంక్షల కాలంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఉద్రిక్తం చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు, గొడవలకు దారితీసే ప్రవర్తన ఏదైనా చోటుచేసుకున్నట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ అధికారులు, కేంద్ర బలగాలు, హోమ్‌గార్డులు మరియు ఎస్‌పీఓలకు ఈ నిషేధాలు వర్తించవని స్పష్టం చేశారు. చట్టపరమైన అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకో లు, ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, ఎవ్వరు కూడా కర్రలు, కత్తులు, తుపాకులు లేదా ఎలాంటి మారణాయుధాలతో సంచరించడం పూర్తిగా నిషేధమని సీపీ తెలిపారు. మైకులు, లౌడ్‌స్పీకర్ల ద్వారా పాటలు ప్రసారం చేయడం, సభలు నిర్వహించడం, ప్రజలను ఒక వర్గం మీద మరొక వర్గం మీద రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషేధమని తెలిపారు. 163 బి.ఎన్.ఎస్.ఎస్. సెక్షన్ అమలు సమయంలో చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే విధమైన ప్రకటనలు, ప్లకార్డులు, గుర్తులు ప్రదర్శించడం కూడా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించిన పక్షంలో, చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోబడతాయి అని సీపీ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :