ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకాన్ని అమలు చేస్తోంది.ఈ నేపథ్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ లొని తన నివాసం లో “ఈద్ కా తోఫా”ను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ శుక్రవారం అర్హులైన కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ నెల అనేది ఉపవాసం, ఆత్మ నియంత్రణ, దానం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన కాలమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రంజాన్ సందర్భంగా పేద మరియు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.అదేవిధంగా రంజాన్ నెలలో మసీదుల్లో నిర్వహించే ఇఫ్తార్ విందుల కోసం డివిజన్కు ఒక మసీదుకు 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయంఅందిస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయంతో మసీదుల్లో సామూహిక ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సోదరభావం మరింత బలపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్ మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News