Friday, 31 July 2026 07:10:19 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విధి నిర్వహణలో వీరమరణం..! కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ సెల్యూట్

Date : 01 February 2026 11:44 PM Views : 184

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో దుండగులు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యను కారుతో ఢీకొట్టి పారిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జనవరి 23న ఈ ఘటన చోటుచేసుకొగా.దాదాపు 9 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. తన డ్యూటీ నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు రక్కసిని అంతం చేసేందుకు ఆమె చూపిన సాహసం వెలకట్టలేనిదని, రక్తమోడుతున్నా వెనకడుగు వేయకుండా పోరాడిన ఆమె త్యాగం నిరుపమానమని కొనియాడారు. గంజాయి మాఫియా వాహనంతో తొక్కించి కిరాతకంగా చంపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ వీరనారి ధైర్యానికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. ఈ ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదని, గంజాయి మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని సజ్జనార్ పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల ముప్పు సమాజానికి ఎంతటి ప్రమాదకరంగా మారిందో సౌమ్య మరణం హెచ్చరిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో అమరురాలైన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మాదక ద్రవ్యాలపై పోరాటం ఆగిపోదని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: