Wednesday, 01 April 2026 01:54:32 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు వర్తిస్తాయి..

Date : 29 March 2026 12:45 AM Views : 40

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగుల్లో ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు పన్ను రేట్లను పెంచకపోయినా, జీత నిర్మాణాన్ని ప్రభావితం చేసే విధంగా కీలక మార్పు లను తీసుకు వస్తున్నాయి. ఈ మార్పుల అమలు బాధ్యతను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించనుంది. నిపుణుల ప్రకారం ఉద్యోగుల మొత్తం కాస్ట్ టు కంపెనీ యథాతథంగా ఉన్నప్పటికీ, జీతంలోని భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునేఅవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు పన్ను రహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు, ఇతర ప్రయోజనాలను కొత్త నిబంధనల ప్రకారం స్పష్టంగా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో ఉద్యోగుల పన్ను విధించదగిన ఆదాయం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులుచెబుతున్నారు. ఇదే సమయంలో గతంలో అమలులోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపించనుంది. ఈ చట్టాల ప్రకారం ఉద్యోగి బేసిక్ జీతం మొత్తం సీటీసీ లో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ లెక్కింపు లు పెరిగే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంగా ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ జీతం కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. అదనంగా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతోంది. కంపెనీ వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వాహనం, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించ బడతాయి. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :