Thursday, 30 July 2026 11:27:52 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కాకా వెంకటస్వామి మెమోరియల్ టి -20 లీగ్ మ్యాచ్‌ను ప్రారంభించిన ఎంపీ

Date : 15 January 2026 09:04 PM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డితో కలిసి, కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ 20 క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదిలాబాద్ – ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సంగారెడ్డి జిల్లా – సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చిమల్దారి కోనాపూర్ గ్రామంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతలో క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ టి 20 లీగ్ యువతను క్రీడల వైపు ఆకర్షించి రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, టి జి ఐ సి సి చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అధికారులు, నిర్వాహకులు, క్రీడాభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :