ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ధనుర్మాసన్ని పురస్కరించుకుని మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతరామాంజనేయ ఆలయం లో వేడుకలు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. ఆండాళ్ ప్రవచించిన పాశురాల పఠనం తో ఆలయ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోదాదేవి పల్లకీ సేవ ను ఆలయ పుర వీధుల్లో గోవింద నామ స్మరణలతో ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులు సామూహిక విష్ణు, సహస్ర నామ స్తోత్రం పారాయణం చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు, గంట్ల రంగారెడ్డి, బోనగిరి సత్యనారాయణ, ఉల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News