ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) లో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పిల్లలందరికీ గణిత బోధానోపకరణాల మేళా, గణిత క్విజ్, గణిత జ్ఞాపకశక్తి పరీక్ష పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత మరియు ఉపాధ్యాయులు జి. భరత్ రెడ్డి, బి. విజయ్ కుమార్, డి. కుమార్, సురేష్, శ్రీనివాస్,బి. మధుసూదన్, ఎం. రమేష్, పోచయ్య, కేశవులు, రవీందర్,ఉమా మహేశ్వర్,శేషాద్రి, పరంజ్యోతి, పాల్గొన్నారు.
Admin
E Nivas News