ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిర్మల్ జిల్లా ఖానా పూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీని బిఆర్ఎస్ మద్దతుతో బిజెపి కైవసం చేసుకుంది.మున్సిపల్ చైర్ పర్సన్ గా అంకం మౌనిక ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయల్ ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉండగాబిఆర్ఎస్ నాలుగు బిజెపి నాలుగు కాంగ్రెస్ మూడు ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచాయి. ఆనూన్యంగా టిఆర్ఎస్ బిజెపికి మద్దతు ఇవ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బిజెపి పార్టీ దక్కించుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
Admin
E Nivas News