ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణ పనులతో పాటు ఆ ప్రాంత రూపకల్పనలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగేస్కిల్స్ యూనివర్సిటీకి చెందిన పలు భవనాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు ఇతర అధికారులు ఉన్నారు.
Admin
E Nivas News