ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆత్మకూరు పట్టణంలోని, ఎన్టీఆర్ కె.వి.కె స్టేడియం నందు జరిగే మెగా జాబ్ మేళా కరపత్రాలను డిపిఓ సుబ్బన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, వి ఆర్ ఎస్ పి చైర్మన్ పోచ మల్లికార్జున రెడ్డి పట్టణ, మండలాధ్యక్షులు వేణుగోపాల్ మరియు రవీంద్రబాబు తో కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా నందు 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని దాదాపు 1250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, దీనిని నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరి వెంట సీనియర్ టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దినకర్, జనసేన నాయకులు శ్రీరాములు, యూనిట్ ఇన్చార్జులు రామ్మూర్తి, నాగూర్ ఖాన్, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పసిపల్ మున్నా, ఆసిఫ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News