ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జల్ సంచయ్ జన్ భాగిదారి ( జె ఎస్ జె బి )నేషనల్ అవార్డు 2025 అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను బుధవారం మంత్రి వివేక్ ఘనంగా సన్మానించారు. చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృధి పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News