ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీరామ్ నగర్ లో శ్రీరామ దేవాలయంలో ఘనంగా నిర్వహించిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని కోరారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News