ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో సీఆర్‌ఆర్ నిధులు రూ. 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు స్థానిక సర్పంచ్ ఇనుగాల లింగయ్య కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రోడ్డు పనులు పూర్తయ్యే సరికి గ్రామంలో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాగిరి శ్రీని వాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మరెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాబు గౌడ్, వార్డు సభ్యులు సాగే మహేష్, గుంటి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News