Thursday, 30 July 2026 12:26:17 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం...

Date : 18 February 2026 02:11 PM Views : 161

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లుమతపెద్దలు తెలిపారు.రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్ర పండుగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర మక్కా మసీదు నెలకున్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులుఒకరికొకరుశుభాకాంక్షలుతెలుపుకుంటున్నారు.మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :