Friday, 31 July 2026 12:44:38 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఈశ్వర చారి త్యాగం మరువలేనిది

Date : 09 December 2025 08:40 PM Views : 230

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ సంఘాల హక్కుల కోసం అమరుడైన ఈశ్వర చారి సేవలు మరువలేనివని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 12 శుక్రవారం మంచిర్యాల పట్టణంలో బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీనిర్వహించే బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి ఆశయసాధన సభ, విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంకి సంబదించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానాయకులు మాట్లాడుతూబీసీల హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి త్యాగం మరువలేనిదని, యావత్ బీసీ సమాజం మేర్కోవాల్సిన విషయమాని, వారిని స్మరించుకుంటూ మంచిర్యాల జిల్లాలో సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ మరియు విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారులతో పార్లమెంట్ శీతకాల సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని, ఆది జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేట్ బిల్లుగా బీసీ రిజర్వేషన్ల బిల్లునీ ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫకేషన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే నోటిఫికేషన్లు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు,ఎంపీ,ఏమ్మెల్యే,ఏమ్మెల్సిలు రాజీనామా చేసి బీసీ ఉద్యమమలోకి రావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కవులు, కళాకారులు రాజకీయ నాయకులు మేధావులు మద్దతుదారులు, ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నారేడ్ల శ్రీనివాస్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు తోట రాజేష్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, టీవీయూవీ పట్టణ సహాయ కార్యదర్శి ప్రసాద్, బీసీ ఉద్యమ నాయకుడు సమయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :