Friday, 31 July 2026 02:45:43 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గ్రామాభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేయాలి

ఎమ్మెల్యే గడ్డం వినోద్

Date : 18 December 2025 08:16 PM Views : 256

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు గా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఘన సన్మానకార్యక్రమంనిర్వహిం చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో గెలుపొందిన బెల్లంపల్లి, నెన్నల్, తాండూర్, కాసిపేట్, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల నూతన సర్పంచ్‌లను బెల్లంపల్లి శాసనసభ్యుల గడ్డం వినోద్ శాలువాలు కప్పిఘనంగాసన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయంపాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్‌లకుసూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, ఏడు మండలాల అధ్యక్షులు , ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: