ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు విద్యకి పరిమితం కాకుండా వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల,కళాశాలలో 2026 వేసవి కాల వృత్తి విద్య కోర్సును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా భవిష్యత్తులో రాణించాలంటే వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టమని ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్చుకున్నట్లయితే జీవితానికి ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈకోర్సును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ శిక్షణ కీలక పాత్ర పోషించడం ఖాయమని వృత్తి విద్యా కోర్సు బోధకుడు కొట్టే మహేష్ తెలిపారు .
Admin
E Nivas News