Friday, 31 July 2026 03:32:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయండి

హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

Date : 29 November 2025 07:40 PM Views : 207

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 7 8 9 తేదీలలో జరిగే సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా హజిపూర్ మండలం గుడిపేట బేవరేజాస్ గోదాం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో డిసెంబర్ 7,8,9 వ తేదీలలో జరుగుతున్న సీఐటయు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూకార్మికుల సమస్యల పరిష్కరమే ద్యేయంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ. కేంద్రంలో నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరించడం చాలా దారుణం. బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను రద్దు చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విదంగా ఈ చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు అమలు జరిపి కార్మికులను బానిసలుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే హమాలీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం వేట్టి చాకిరీ చేయించుకుంటూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. కనీస వేతనాలు చెల్లించాలి. అర్హులైన నిరుపేద కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను, భవిష్యత్తు కార్యచరణను ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 7వ తేదీన మెదక్ పట్టణంలో జరిగే ర్యాలీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, హమాలీ యూనియన్ అధ్యక్షులు , కోశాధికారి మహేందర్, ఉపాధ్యక్షులు మిట్ట మల్లేష్, సహాయ కార్యదర్శులు బి. సుధాకర్, మేస్రి శంకర్, సభ్యులు దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :