Friday, 31 July 2026 09:40:43 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 29 June 2026 09:37 PM Views : 59

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్డ్ కులములు,షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి.అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డి.సి.పి.ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి.రాములు, బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్,జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల,బెల్లంపల్లి, జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి పోలీస్, రెవెన్యూ,సంబంధిత శాఖల అధికారులు, ఎస్.సి.,ఎస్.టి.విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్మాట్లాడుతూ మంచిర్యాలజిల్లాలో నెలకొన్న ఎస్.సి., ఎస్.టి. సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్.సి.,ఎస్.టి.ల అభివృద్ధి,కేసులు, ఎన్ ఫోర్స్ మెంట్ అమలు అంశాలపై తీసుకుంటున్న చర్యలపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎస్.సి., ఎస్.టి.లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇండ్లు నిర్మించుకోలేని వారికి గుత్తేదారుల సమన్వయంతో ఇల్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రగతికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థుల హాజరు శాతంపెంపొందించాలని, విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేయాలని తెలిపారు.పోలీసు శాఖ పరిధిలోని అట్రాసిటీ కేసులు కార్యచరణ ప్రకారంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. అట్రాసిటీ కేసులలో తప్పుడు కేసులు నమోదు చేసిన వాటి వివరాలను స్పష్టంగా రికార్డులలో నమోదు చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కేసులలో ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులో వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు.అధికారుల చొరవతో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ ద్వారా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని,పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గంజాయి, నిషేధిత మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా చేపట్టాలని, జిల్లాలో క్రయ విక్రయాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో బెల్ట్ షాపులు అధికమవడంతో యువత పక్కదారి పడుతుందని, నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుధ్యం, త్రాగునీరు ఇతర ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సంబంధిత జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 7 గ్రామాలకు అదనంగా 20 లక్షల రూపాయల చొప్పున గ్రామపంచాయతీ నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండానిర్వహించడం జరుగుతుందని, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించాలని, సంక్షేమ వసతి గృహాలలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. డి.సి.పి. మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల నియంత్రణపై ఎస్.సి., ఎస్.టి. లకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.పౌర హక్కుల దినోత్సవకార్యక్రమాలను గ్రామపంచాయతీలలో నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కులపై అవగాహన కలుగుతుందని తెలిపారు.కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.సరైన ఆధారాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించి రిహాబిటేషన్ సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడంజరుగుతుందని తెలిపారు. ఆబ్కారీ - మద్య నిషేధ శాఖ సమన్వయంతో బెల్ట్ షాపుల నియంత్రణపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దమ్మ నారాయణ,చిలుక రాజనర్సు,దుర్గం ఎల్లయ్య, పెద్ది రాజన్న, జిల్లా పౌర సంబంధాల అధికారి, యం.కృష్ణమూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, గిరిజన అభివృద్ధి, టి.జి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఈ.ఐ.ఎస్.శాఖల అధికారులు, కలెక్టరేట్ బి విభాగం పర్యవేక్షకులు మధుసూదన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :