Friday, 31 July 2026 02:30:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీ

Date : 20 December 2025 06:39 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు తెలంగాణ గణిత ఫోరం పెద్దపల్లి జిల్లా విభాగం సూచనల మేరకు శనివారం మంథనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో మంథని మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. గణిత ప్రతిభా పాటవ పోటీకి ఆంగ్ల మాధ్యమం నుండి 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎన్. పరమేష్, రెండవ బహుమతి ఎం. జోత్స్న జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మంథని, తృతీయ బహుమతి ఎన్. ధనుష్ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ మంథని, రెసిడెన్షియల్ విభాగంలో ప్రధమ బహుమతి కె.సాయి వినయ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని, రెండవ బహుమతి ఈ. శ్రీ వల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మంథని, తృతీయ బహుమతి ఆర్. విశాల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని విద్యార్థులు గెలుపొందగా వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంశా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ సుమలత, వివిధ పాఠశాల గణిత ఉపాధ్యాయులు, టిఎంఎఫ్ మండల శాఖ బాధ్యులు ఎన్. పరంజ్యోతి, ఎస్.శ్రీనివాస్ పరిశీలకులుగా శ్రీ జి.భరత్ రెడ్డి లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :