ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు మేము పెండింగ్ లో పెట్టలేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపా రు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రూ"627 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెట్టిందని అన్నారు. అందులో రూ 240 కోట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ"360 కోట్లు ప్రవేట్ ఆస్పత్రులకు బకాయిలు ఉందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంపై కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ బకాయిలను మోస్తూనే, పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వ రెండు కళ్ళని, ఈ రంగాలకు నిధుల కోత విధించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ బకా యిలపై స్పష్టత ఆరోగ్య శ్రీ చెల్లింపులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం తిప్పికొట్టారు. డిసెంబర్ 2023 నాటికి ఉన్న రూ.627 కోట్ల పెండింగ్ బకాయిల భారాన్ని తమ ప్రభుత్వం స్వీకరించిందని, ఇప్పటివరకు రూ.2,408 కోట్లను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రుల కు రూ.1,480 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కేవలం రూ.727 కోట్లు మాత్రమే బకాయి ఉన్నాయని, చెల్లింపులు నిరంతరం జరుగుతున్నా యని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో పారదర్శకత గతంలో సీఎంఆర్‌ఎఫ్, చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని తెచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.2,046 కోట్లు అందించామని, ఆరోగ్య శ్రీతో కలిపి మొత్తం రూ.4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలోని 35 మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీచింగ్ ఆసుపత్రుల పర్యవేక్షణను గ్రూప్-1 స్థాయి అధికారికి అప్పగించాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలిపారు. గోషామహల్‌లోని 30 ఎకరాల్లో రూ.3,000 కోట్లతో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని, దీనివల్ల అదనంగా 10 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ కేంద్రాలుగా మారుస్తామన్నారు. ప్రవాస డాక్టర్ల కోసం ప్రత్యేక వెబ్ సైట్ విదేశాల్లో స్థిరపడిన తెలుగు డాక్టర్ల సేవలను వినియోగించుకునేందుకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడి ఆసుపత్రుల్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, కులగణన ఆధారంగా కోటి15లక్షలకుటుంబాలకు 'ఇందిరమ్మ జీవిత బీమా' కల్పించి ప్రతి కుటుంబానికి ధీమా ఇస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
Admin
E Nivas News