ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌ గాని కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలోని ఫామ్ అరవింద రిసార్ట్లో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న ఫామ్ అరవిందలో పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ మెలకువలు నేర్పించనున్నామన్నారు. రాజకీయ శిక్షణ శిబిరాలను మంథని డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల యాదవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని మల్లేషం యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంథని మండల అధ్యక్షుడు పరుషవేని మోహన్ యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్, గోకుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, కార్యవర్గ సభ్యులు శీలారం పర్వతాలు, కార్యదర్శి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మంథని మండల ఉపాధ్యక్షులు కనగంటి ఓదెలు యాదవ్, వేముల లక్ష్మయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ శ్రీనివాస్, కనెవేన శ్రీనివాస్ యాదవ్, జాగరి సదానందం యాదవ్, కనవేన కొమురయ్య యాదవ్, కనవేన రమేష్ యాదవ్, మోత్కు రాజబాబు యాదవ్, జక్కుల కుమార్ యాదవ్, మాదరవేన ఓదెలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News