Thursday, 30 July 2026 12:11:30 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మంథనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 28 December 2025 10:19 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ మంథని మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ వేడుకలను పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ ఆవిర్భావ జెండా వద్ద జెండా ఎగరవేసి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, సింగిల్ విండో మాజి చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాంట్ల సంతోషిని, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ ఎంపీపీ కొండా శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ లు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబుల అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కేవలం రాజకీయ చరిత్ర కాదని అది త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పరిపాలన వరకు సాగిన భారత ప్రజాస్వామ్య గాథ అన్నారు. నిన్నటి పోరాటం, నేటి ఆలోచన, రేపటి ఆశ.. ఈ మూడింటి మధ్య వంతెనగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటి అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల కోసం ఎల్లప్పుడు ముందుండి కొట్లాడే పార్టీ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసి యూపీఏ పాలనతోనే సమాచార హక్కు చట్టం (RTI–2005) పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, విద్యాహక్కు చట్టం (RTE–2009) 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్యను మౌలిక హక్కుగా మార్చి ఆహార భద్రత చట్టం (NFSA–2013) పేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు లభించేలా చేసిందన్నారు. కోట్లాది కుటుంబాలకు ఆహార భరోసాను కల్పించి అటవీ హక్కుల చట్టం (2006) అడవుల్లో నివసించే గిరిజనులకు భూమిపై, వనరులపై హక్కులు కల్పించి భూమి సేకరణ చట్టం (2013)– భూమి సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారాన్ని తప్పనిసరి చేసిందన్నారు. ఇందుకు భిన్నంగా గత 12 ఏళ్లు కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తు ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బొగ్గు గనులు, జాతీయ రహదారులను ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి ‘జీ–రామ్ జీ’ అని పేరును, ఆ చట్టంలో నిబంధనలు మార్చి, ఆ చట్టాన్ని దాదాపు నిర్వీర్యం చేసిందని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. మరోపక్క రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతుంటె నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. దేశంలో మతం పేరుతో నిత్య దాడులు పెట్రేగిపోతున్నాయన్నారు. దశాబ్ద కాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని, రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, అందుకు తెలంగాణ నుంచి బీజం పడిందన్నారు. రాష్ట్రంలోని ప్రజాపాలన దేశానికే ఆదర్శంగా నడుస్తుందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మళ్ళీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: