Friday, 31 July 2026 01:48:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు..

Date : 27 February 2026 07:44 AM Views : 162

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, జీఓ 103 సవరణలపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగించనున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30వరకుకొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌లో, జీఓ 252 మరియు సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇస్తూ, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓ 252 మరియు సవరించిన జీఓ 103పై లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఘౌస్ ముహియుద్దీన్ అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపును స్వాగతిస్తూ, ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనని, జర్నలిస్టులకు న్యాయం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :