Wednesday, 17 June 2026 02:23:48 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

40 ఏళ్ల బంధాన్ని తెంచుకోక తప్పడం లేదు...

Date : 18 March 2026 07:41 AM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల బంధం తెగుతోందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా తాను పార్టీలో అనేక సేవలు అందించానని, కానీ తన వర్గానికే న్యాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు జీవన్ రెడ్డి తన వర్గానికి చెప్పారు. ఈ నెల 25న బీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. తన అనుచరులు అందరూ రావాలని, బీఆర్ ఎస్ తో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను ఈ సందర్భంగా ఆయన ఆకాశానికి ఎత్తేశారు. మాజీ సీఎం రాజకీయంగా మనకు మంచి మార్గం చూపిస్తారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం పార్టీ మారడం లేదని, అవమానాలు భరించలేకే తాను పార్టీ మారాల్సి వస్తోందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా గత 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. బీఆర్ ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, అయితే ఇది అధికారికంగా జరగలేదు. దీంతో జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. దీనిపై ఇప్పటికే రెండు మూడు సార్లు అధిష్టానం కూడా దృష్టి సారించినా ఫలితం కనిపించలేదు. తన వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన జీవన్ రెడ్డి నుంచి వినిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా జగిత్యాల మునిసిపల్ చైర్మన్ పోస్టును తనవారికి ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపారు. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవన్ రెడ్డికి బీఆర్ ఎస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో చూడాల్సిందే..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: