Friday, 19 June 2026 01:36:07 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

డీజీపీగా సీవీ ఆనంద్‌?.. సీఎస్‌గా మరికొంత కాలం రామకృష్ణారావుకే చాన్స్‌..

Date : 10 March 2026 10:00 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి. ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ నియామకం జరిగే అవకాశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1992 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్‌కు చెందిన అధికారి కావడంతో సీనియారిటీ పరంగా ఆనంద్‌కు ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపినట్టు సమాచారం. ఈ జాబితాలో 1994 బ్యాచ్‌కు చెందిన సౌమ్య మిశ్రా , వినయ్ కుమార్ ఆప్టే మరియు 1995 బ్యాచ్‌కు చెందిన Shikha Goel పేర్లు కూడా ఉన్నాయి. అయితే వీరిలో అందరి కన్నా సీనియర్‌గా, సమర్థుడిగా గుర్తింపు పొందిన సీవీ ఆనంద్‌కే ప్రభుత్వం డీజీపీ పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సీఎస్‌గా మరికొంత కాలం రామకృష్ణారావుకే చాన్స్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా ఉన్న కే. రామకృష్ణారావు ఉద్యోగకాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. గత ఏడాది ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల పాటు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో జనగణన, “సర్” అమలు వంటి కీలక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డినేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం. గతంలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీఎస్‌లకు ఏడాది వరకు కూడా ఎక్స్‌టెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నందున రామకృష్ణారావుకు కనీసం మూడు నెలల పాటు మరింత పొడిగింపు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్‌టెన్షన్ లేకపోతే జయేశ్ రంజన్‌కు అవకాశం..ఒకవేళ రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకపోతే తదుపరి సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు అదే బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్, సంజయ్ జాజు పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.అదే సమయంలో 1994 బ్యాచ్‌కు చెందిన సభ్యసాచి ఘోష్ కూడా సీఎస్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో సీనియారిటీ పరంగా 1991 బ్యాచ్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆయనపై ఆసక్తి లేదని సమాచారం. ఆయనపై ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో సీఎస్ పదవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. రామకృష్ణారావుకు ఎక్స్‌టెన్షన్ ఇవ్వని పరిస్థితిలో జయేశ్ రంజన్ తదుపరి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: