ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన మడే రాజేష్ కి సేవా కార్యక్రమాలకు గాను గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. రాజేష్ సమాజంలోని పేద విద్యార్థుల చదువులకు అవసరమయ్యే ఆర్థిక సహకారం అందించినందుకు ఈ పురస్కారం అందజేశారు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయం లో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజేష్ సేవలను గుర్తించిన ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్, స్ఫూర్తి అకాడమీ సంస్థ ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ను అతనికి ప్రధానంచేసింది. హైదరాబాద్ లోని బొగ్గులకుంట సరస్వత పరిషత్ లో గత సోమవారం జరిగిన కార్యక్రమంలో రాజేష్ కు డాక్టర్ గూడూరు చిన్నారెడ్డి, యాదగిరి గౌడ్, సరిత అవార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అవార్డ్ రావడం తో తనపై మరింత బాధ్యతను పెంచిందని,భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. రాజేష్ కు అవార్డ్ రావడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు.
Admin
E Nivas News