Thursday, 30 July 2026 10:10:01 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రేవంత్ దూకుడు ముందు తేలిపోతున్న కేటీఆర్...

Date : 20 March 2026 07:29 PM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ, అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక రసవత్తర యుద్ధానికి వేదికైంది. అయితే ఈ పోరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశారు. ముఖ్యంగా కేటీఆర్ వంటి వారు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. రేవంత్ రెడ్డి అటు రాజకీయ విమర్శలతో పాటు, ఇటు పాలనాపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టారు.పాత అస్త్రాలతోనే కేటీఆర్ కొత్త వ్యూహంతో రేవంత్ ఈ చర్చలో కేటీఆర్ ప్రసంగం అంతా పాత ఆరోపణల చుట్టూనే తిరిగింది. ఆరు గ్యారెంటీల అమలు, రుణమాఫీ వంటి అంశాలపై ఆయన చేసిన విమర్శలను మంత్రులుఅప్పటికప్పుడు తిప్పికొట్టారు. ముగిసిన అధ్యాయం లాంటి అంశాలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం వల్ల ప్రజల్లోకి వెళ్లాల్సిన గట్టి సందేశంపలచబారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి అత్యంతవ్యూహాత్మకంగా వ్యవహరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగడుతూనే, తమ ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే పనులపై తెలంగాణ రైజింగ్-2047 వంటి విజన్ డాక్యుమెంట్లను ప్రస్తావించి సభను తన వైపు తిప్పుకున్నారు. మూసీ ప్రాజెక్టుపై రివర్స్ అటాక్... ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ మూసీ నదిపై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను సభలో ప్రదర్శించి, వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చాలని అప్పుడు చెప్పింది మీరు కాదా అని రేవంత్ ప్రశ్నించినప్పుడు, బీఆర్ఎస్ సభ్యుల దగ్గర సరైన సమాధానం లేకపోయింది. కేటీఆర్ కేవలం సోషల్ మీడియా వేదికగా చేసే విమర్శలను సభలోనూ పునరావృతం చేయడం వల్ల, రేవంత్ వేసిన ప్రత్యూహాల ముందు అవినిలబడలేకపోయాయి. అంచనా తప్పిన కేటీఆర్... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎప్పటిలాగే తక్కువ అంచనా వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేవలం వాక్చాతుర్యంతోనే కాకుండా, గణాంకాలు పాత రికార్డులతో సిద్ధమై రావడంతో బీఆర్ఎస్ శిబిరంలో గందరగోళం నెలకొంది. పైగా, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరు కాకపోవడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకుంటూ సభకు రాకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. గెలుపు సవాల్‌తో రేవంత్ దూకుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, మరోసారి గెలిచి చూపిస్తాం అని విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీలో చర్చా సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ, బీఆర్ఎస్ తరపున మాట్లాడిన నాయకులు కేవలం పాత చింతకాయ పచ్చడి లాంటి విమర్శలకే పరిమితం కావడంతో, అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డిని కట్టడి చేసే అవకాశం చేజారిపోయింది. రాబోయే రోజుల్లో అయినా కేటీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టడం కష్టమేనని అభిప్రాయం తర్వాత సర్వత్ర వ్యక్తం అవుతుంది..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: