ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఏఈఓ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రైతు బీమా ఫైల్ క్లియర్ కోసం వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించగా పది వేలు డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఏఈఓ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి అధికారులకు, 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.
Admin
E Nivas News