ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రజా కవి అందెశ్రీ సంకలనంలో భాగమైన కాటారం వాసి గౌరోజు సదానందం భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో ప్రజాకవి సంకలనం పుస్తకావిష్కరణ హైదరాబాద్ త్యాగరాయ గాన సభ గండవరపు హనుమంతరావు కళావేదికల వైభవంగా జరిగింది. ఈకవితాసంకలనపుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బైసా దేవదాసు. నేటి నిజం పత్రికా సంపాదకులు, డాక్టర్ నాళేశ్వరం శంకరం. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. పాణ్యం దత్త శర్మ ప్రముఖ కవి రచయిత కాలమిస్ట్ ప్రవచనకర్త మౌనశ్రీ మల్లిక్. సినీ టీవీ గేయ రచ యిత రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులందరూ సభను ఉద్దేశించి మాట్లాడుతూ సంకలనంలో ప్రచురించిన కవితలు అద్భుతంగా ఉన్నాయని కవి హృదయం ఎప్పుడూ అన్ని రకాల కవితలను రాయడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతంగా చేసేవిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే అందెశ్రీ జీవితంలోని కొన్ని ఉదంతాలను ఉటంకించారు. ఈ కవితా సంకలనంలో కాటారం నుండి సదానందం బాపూజీ యోగాచార్యులు మోటివే షనల్ స్పీకర్ వారి కవితలు పంపగా వారి శీర్షికలు కూడా ప్రజాకవి అందే శ్రీ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. వాటిని చూసిన ముఖ్య అతిధులు వారి కవితల పట్ల స్పందిస్తూ ఇలాంటి కవితలు ఇంకా రావాలని ముందు తరాల కవులకు ఆదర్శంగా నిలవాలని సదానందంను పలువు అభినందించారు. అనంతరం సభా వేదికలో కవులను తగిన రీతిలో ప్రశంస పత్రం సీల్డ్తో సత్కరించారు. సదానందం బాపూజీ. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అతిథులకు సదానందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
E Nivas News