Friday, 31 July 2026 09:34:41 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర..

Date : 29 March 2026 09:40 PM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచిరూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమయ్యేలా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను తీసుకువస్తూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.తల్లిదండ్రుల హక్కులు కాపాడాలన్నదే నా ధ్యేయం అన్నారు. అంతకుముందు తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రుల కోసం సామాజిక బాధ్యతగా చట్టం తీసుకు వచ్చామన్నారు. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై బిల్లు తేవడం బాధాకరమేనని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. పిల్లలు భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు.పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని వివరించారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్‌ వివరించారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2007లో వృద్ధుల కోసం కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించకుండా ఇవ్వాలని అందులో ఉందని తెలిపారు. అందుకే తాము తెచ్చిన చట్టంలో రూ.10 వేల నిబంధన పెట్టినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని,ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ చర్చలో రామాయణంలోని శ్రావణకుమారుడి కథతోపాటు రేమాండ్స్ సంస్థ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి క్లుప్తంగా వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: