ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి విలువైన (1097500 ) రూపాయల చెక్కులను మరియు మంచిర్యాల, హజీపూర్ మండలానికి చెందిన 138 మంది లబ్ధిదారులకు విలువైన (13816008) రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు గురువారం పంపిణీ చేశారు.సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ప్రజల కష్ట సుఖలు తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో నుండి వారికి సేవ చేయడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, దేవాపూర్ అదాని సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్య పాల్ రావు సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News