ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో నూతన చైర్ పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, వైస్ చైర్‌పర్సన్‌గా కాలం సునీత రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.మరిపెడ మున్సిపల్ లో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు , బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు , ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామన్నారు. అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నూతన చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన గెలుపు బాధ్యతగా భావించి పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్ల ఏర్పాటు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్‌తో కలిసి సమన్వయంతో పని చేస్తూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, మౌలిక సదుపాయాల బలోపేతం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వార్డు కౌన్సిలర్లు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తామని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందించాలని, మరిపెడ మున్సిపాలిటీలో నూతన నాయకత్వ బాధ్యతలు స్వీకరించడంతో పట్టణ అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు పెరిగాయి. కొత్త పాలకవర్గం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీ రూపురేఖలను మార్చే దిశగా సాగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్,మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, షేక్ అఫ్జల్, కాలం రవీందర్ రెడ్డి, మచ్చ వెంకట నరసయ్య, అల్వాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, పొన్నం వినయ్ ,ముదిరెడ్డి నరేష్ రెడ్డి, నల్లు శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ యుత్ అధ్యక్షులు బానోత్ నరేష్, వెంకన్న, మహేష్, కొన్నే సోమన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News