ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఒక పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను జలగలాగ పీడించి ఉండకపోతే అంతలా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. నీతి లేదు నియమం లేదు,కనీసం మానవత్వం కూడా ఉండటం లేదు. దినసరి కూలీలను కూడా వదలరు. కేసు వచ్చిందంటే. పీక్కు తినడమే ఆ ఎస్ఐ తీరు. అందరూ అలా ఉండరు కానీనీతిగా ఉండి విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు సిబ్బంది ఉన్నారు. కానీ ఇప్పుడు అవినీతి పరుల సంఖ్య పోలీస్ శాఖలో వేగంగా విస్తరిస్తోంది అనడంలో సందేహం లేదు అనే అభిప్రాయాలు సర్వత్వ వ్యక్తం అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సై హరిప్రసాద్ రెడ్డి పట్టు పడ్డారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు డబ్బులు ఇస్తుండగాట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనేఅంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలా మందిని డబ్బులకు పీడించాడని, దారుణంగా కొట్టేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా భూతగాదాలు, సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండుకున్నాడని బాధితులు ముక్త కంఠంతో తెలిపారు.
Admin
E Nivas News