ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : పెన్షన ర్స్ మరియు సీనియర్ సిటి జన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం డివి జన్ కేంద్రంలో సీనియర్ సి టిజన్స్ డే కేర్ సెంటర్‌ను ఏ ర్పాటు చేయాలని రాష్ట్ర సీ నియర్ సిటిజన్ నాయకు లు,డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మరియు విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యద ర్శి ఎం.రఘు శంకర్ రెడ్డి కో రారు.మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో కా టారం రెవెన్యూ డివిజన్ స్థా యి పెన్షనర్స్ మరియు సీని యర్ సిటిజన్స్ సమావేశం సీనియర్ సిటిజన్ జనగామ కరుణాకర్ రావు.అధ్యక్ష తన నిర్వహించారు.ఈస మావేశంలో పలిమెల,మ హాదేవపూర్,కాటారం,మ హాముత్తారం,మలహర్రావు మండలాలకు చెందిన ప్రతి నిధులు పాల్గొన్నారు.ఈసం దర్భంగాముఖ్య అతిథిగా హాజరైన ఎం.రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్ పరిధిలో సుమారు 450.మంది పెన్షనర్స్ మరి యు వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని తెలి పారు.వారి శారీరక,మాన సిక ఉల్లాసం కోసం,జీవన నాణ్యతమెరుగుపర్చేందుకు సీనియర్ సిటిజన్స్ రిక్రియే షన్ మరియు డే కేర్ సెంట ర్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈవిషయం లో స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర సీనియర్ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బా బు ప్రత్యేక చొరవ తీసుకొని డే కేర్ సెంటర్ మంజూరుచే యాలని కోరారు.ఈసమా వేశంలో అంకమ్మ,అంకన్న, శంకరయ్య, వెంకటి,ఎం.ర వి శంకర్ రెడ్డి,ఎం.రఘు శం కర్ రెడ్డి, జె. కరుణాకర్ రా వు,మధుసూదన్ రావు,దా మోదర్ రెడ్డి,డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.తిరు పతి. తోపాటుతదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News