ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పేకాట,కోడిపందాలు, ఇతర చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించడంతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించిన కీలక ప్రదేశాలలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కమిషనరేట్ సరిహద్దు జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్‌లతో సమన్వయం ఏర్పాటు చేసి సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేకాట, కోడిపందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
Admin
E Nivas News