Thursday, 30 July 2026 11:25:31 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అర్హులందరికీ పథకాలు అందించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి..

సీఎం రేవంత్ రెడ్డి

Date : 04 March 2026 10:25 AM Views : 199

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంతే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామ సభల్లో ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై విస్తృత అవగాహన కల్పించాలనిఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలతోఅనుసంధానం చేయాలని,తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు కచ్చితంగా చెల్లించబడేలా చూడాలని,99 డేస్ ప్రోగ్రామ్‌లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సిఎస్. రామకృష్ణారావు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తెలంగాణలోని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :