ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎదురుగాలులకు మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తెలిపారు. నా వంతు సహాయంగా కుటుంబానికి రెండు లక్షలు అందించడంతోపాటు ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు మృతదేహాలకు నివాళులర్పించారు.
Admin
E Nivas News