Friday, 19 June 2026 01:27:12 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు..

Date : 13 February 2026 09:16 AM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రెస్‌నోట్‌లో వివరణ జగ్గారెడ్డి ఇచ్చారు . బుధవారం సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడిని సీఐ గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టారని తెలిపారు. తన పార్టీ నాయకుడిని రక్షించుకోవడానికి బూత్‌కు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీఐ తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతినేట్లు చేసిన సీఐని తిట్టడం జరిగిందని జగ్గారెడ్డి వివరించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కానీ పది మంది మధ్యలో తమ పార్టీ నాయకుడికి సీఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలను సీఐ లేదా తాను ఉల్లంఘించినా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరూ దానిని స్వాగతించాలని అన్నారు. న్యాయస్థానంలో ఎవరి తప్పు, ఎవరి ఒప్పు తేలుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకే వదిలేశానని చెప్పారు. మరోవైపు, బుధవారం సంగారెడ్డిలో జరిగిన సంఘటనను కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తిప్పారని మండిపడ్డారు. అధికారులపై జగ్గారెడ్డి దాడి చేస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ‘గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని బూతు పదజాలంతో తిట్టారన్నారు. తెలంగాణ పోలీసులను తన్ని, తిట్టి, ఆంధ్రోళ్లకు పుట్టారా' అంటూ హరీశ్ రావు నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్, హరీశ్ రావు తిట్టిన విషయాలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: