Thursday, 30 July 2026 07:18:28 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు..! పట్టణంలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదు

డీఎస్పీ.ఎల్. జీవన్ రెడ్డి

Date : 08 February 2026 07:59 PM Views : 135

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వరుసగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలుతీసుకుంటున్నామని అదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు భంగం కలిగించే, ఓటర్లను ప్రలోభపెట్టే, రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.పోస్టర్లు, ఫ్లెక్సీలతో కించపరిచేలా ప్రవర్తించిన నలుగురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను ప్రభావితం చేసిన మామిడాల దశరథ్, నిమ్మల రవీందర్ రెడ్డి, అరవింద్ కుమార్, రాహుల్ రెడ్డిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామన్నారు.. ఘటనలోఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయిందన్నారు. ఎన్నికల సమయంలో అనుమతి లేని ప్రచారం నేరమని తెలిపారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. *సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టుల నిందితుడి అరెస్ట్* సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఆడేపు రవిని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్‌ఎస్‌టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టులకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థులను కించపరిచే పోస్టులు నేరమని తెలిపారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం చేసినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఓటర్ల ప్రలోభాలకు మద్యం నిల్వలు – రెండు కేసులు నమోదు చేస్తామన్నారు.సంజయ్‌నగర్‌లో నలవల సుమ వద్ద రూ.47,740 విలువగల 50.580 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో జక్కుల సచిన్ వద్ద 15.6 లీటర్ల మద్యం పట్టుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. బైక్ స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో మద్యం పంపిణీపై కఠిన నిఘా కొనసాగుతుందని తెలిపారు. *మద్యం తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు* వన్‌టౌన్ పరిధిలో తనిఖీల్లో 48 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.9,120 విలువగల మద్యం పట్టుకున్నారు. భూపతి వెంకటేష్, గంటి కళ్ళ ముఖేష్‌లపై కేసు నమోదు చేశారు. మద్యం తరలిస్తున్న బైక్‌ను సీజ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నంగా గుర్తించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. *ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి టపాకాయలు పేల్చిన కౌన్సిలర్ అభ్యర్థి సహా ఆరుగురిపై కేసు* కుర్షిద్‌నగర్‌లో అభ్యర్థి షాహిదా షేక్‌కు అనుకూలంగా టపాకాయలు పేల్చారు. ఎఫ్‌ఎస్‌టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. షాహిదా షేక్, సలీం, హర్బాజ్, రియాజ్, గఫార్, మోసిన్‌లపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, టపాకాయలు నిషేధమని తెలిపారు. సమయానికి మించి ప్రచారం చేసినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత గ్రంథాలు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత గ్రంథాలను పంచుతూ మత విశ్వాసాన్ని అడ్డుగా పెట్టుకొని ఓటర్లను ప్రలోభం పెడుతున్న 25వ వార్డు అభ్యర్థి బొంపల్లి హనుమాన్లు పై కేసు నమోదు చేయడం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మత విశ్వాసాలను అడ్డుగా ఉంచుకోకూడదని తెలిపారు. ప్రజలకు పోలీసుల సూచనలు... అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, టపాకాయలు నిర్వహించవద్దు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దుఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేయవద్దు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని, చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :