Friday, 19 June 2026 01:43:46 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

నస్పూర్ సహారా ఇండియా కార్యాలయం ముందు బాధితుల ధర్నా...

డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్...

Date : 13 March 2026 12:05 AM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ సిసిసి ఎక్స్ రోడ్ వద్ద గల సహారా ఇండియా కార్యాలయం ముందు గురువారం సహారా బాధితులు డిపాజిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సహారా ఇండియా సంస్థపై గతంలో ఉన్న నమ్మకంతో మేము కష్టపడి పైసా పైసా పోగేసి కూడా పెట్టుకొని సంపాదించుకున్న వేలాది రూపాయలను సహారా సంస్థ ఏజెంట్ల మాయమాటలు నమ్మి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వయోవృద్ధులు ఒంటరి మహిళలు కూలినాలు చేసుకొనే పేద మధ్య తరగతి ప్రజలు చిరు వ్యాపారులు తదితరులు సహారా సహారా ఇండియా సంస్థలో కోట్లాది రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేసినారని విషయాన్ని వినతిపత్రం సహారా ఇండియా మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. సంస్థలు పిక్స్ డిపాజిట్ చేసిన లక్షలాదిమంది ఖాతాదారుల పాలసీలు మెచ్యూరిటీలు పూర్తి అయి ఏండ్లు గడుస్తున్న లక్షలాదిమంది సహారా ఖాతాదారులైన సీనియర్ సిటిజన్స్ వృద్ధ మహిళలను వయోవృద్ధులను సహారా ఇండియా ఆఫీసుల చుట్టూ మా చెప్పులు అరిగేలా తిపించుకుంటూ ఒక నెల తర్వాత రండి మూడు నెలల తర్వాత రండి ఆరు నెలల తర్వాత రండి అంటూ ఆన్లైన్లో నమోదు చేయాలని సహారా ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ పట్టాలో తప్పులు ఉన్నాయని లాయర్ ద్వారా నోటరీ తేవాలని కలబొల్లి మాటలు చెప్తూ సంవత్సరాల తరబడి సహారా ఆఫీసుల చుట్టూ మమ్ములను తిపించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సహారా ఇండియా లో పాలసీలు మెచ్యూరిటీ పూర్తిఅయిన వారి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సహారా ఇండియాలో లక్షలాదిమంది డిపాజిట్ చేసిన ఖాతాదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మానసిక మానసిక శోభ అనుభవిస్తున్నారని మేనేజర్ కు వివరించారు. 10-15 రోజులలో సహారా ఇండియా సంస్థలో మేము డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వారి వారి డబ్బులు వెంటనే చెల్లించాలని లేనియెడల సహారా కార్యాలయం ముందు బెల్లంపల్లి మందమర్రి మంచిర్యాల నస్పూర్ సహారా కార్యాలయం ముందు సహారా ఖాతాదారులతో కలిసి శాంతియుతంగా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు గాని లేకుంటే అమర నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు,ఎంపీ కానీ ప్రభుత్వంలోని మంత్రులు గాని , స్థానిక మన జిల్లా కలెక్టర్ సహారా బాధితుల మొరను వెంటనే ఆలకించి సంబంధిత సహారా సంస్థ యాజమాన్యం తో మాట్లాడి ఆర్థిక ఇబ్బందులతో సతమత అవుతున్న సహారా బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ముక్తకంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బీసీ సంఘాల నాయకులు గజెల్లి వెంకటయ్య , సహారా బాధితులు జి వెంకట్ రెడ్డి , పెద్దపల్లి మల్లయ్య , మోతే కాంతయ్య, డి రాజమౌళి , అంకం సతీష్ , రెడవని శంకర్, కే మల్లయ్య, పిరిపిరెడ్డి అరుణ , నక్షత్ర , మహేష్, సహారా మహిళా బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: