ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని బన్నెచెరువు సమీపంలో కొండచిలువ సంచరించడంతో ఆ ప్రాంతంలోని రైతులు సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం బన్నె చెరువు సమీపంలో బుద్ధార్తి శ్రీనివాస్ అనే మేకల కాపరి తన మేకలను మేపుతుండగా వింత అరుపులు, శబ్దాలు రావడంతో భయాందోళనకు గురై ఆ ప్రాంతం నుండి మేకలను తరలించుకెళ్లాడు. పశువుల కాపరి శబ్దాలు ఎక్కడ నుండి వస్తున్నాయని వెతకగా ఒక చెట్టుకు కొండచిలువ చుట్టుకొని ఉండడాన్ని గమనించి స్థానికులకు తెలియజేశాడు. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు వచ్చేసరికి పాము అక్కడనుండి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. చెరువు సమీపం ప్రాంతాల ప్రజలు, ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు. పాము సమీప ప్రాంతాల ప్రజలకు ఎవరికైనా కనపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Admin
E Nivas News