ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉత్తర ప్రదేశ్‌లోని కంహరియా షరీఫ్ లో ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు నిర్వహించనున్న జమాలే సైలని సర్కార్ ఉర్స్ ఉత్సవాల కు సంబంధించిన గోడ ప్రతులను మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ ఎండీ అహ్మద్, నిజామీ సంస్థ సభ్యులతో కలిసి విడుదల చేశారు.ఉర్స్ ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా నిజామీ సంస్థ ప్రతినిధులు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండీ అహ్మద్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నిసార్, నిజామీ సంస్థ ప్రతినిధులు షబ్బీర్ నిజామీ, రఫీక్ నిజామీ, అమర్ బీన్ హస్సన్ నిజామీ, జాకీర్, ముజాహిద్, అబ్దుల్ హన్నాన్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News